బీజేపీకి మళ్లీ అవే సీట్లు.. ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

బీజేపీకి మళ్లీ అవే సీట్లు అని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దాదాపుగా 2019లో వచ్చినన్ని సీట్లే వస్తాయని అంచెనా వేశారు. 303 సీట్లు లేదా అంతకంటే కొన్ని అదనపు సీట్లు రావచ్చని పేర్కొన్నారు. మళ్లీ మోడీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.

కేంద్రంలో ప్రత్యామ్నాయ పార్టీ అధికారంలోకి రావాలనే డిమాండ్ లేదని పేర్కొన్నారు. ఇక ఈ సారి 400 సీట్లు గెలుస్తామని బీజేపీ పేర్కొంటుంది. కానీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అంచనా మేరకు 400 సీట్లను బీజేపీ గెలువబోదని పేర్కొన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి తప్పదు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news