ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. సికింద్రాబాద్​ ఎక్స్​ప్రెస్​లో మంటలు

-

ఒడిశాలో ఇటీవలే ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. యావత్ దేశం ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇంకా ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఒడిశాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో సికింద్రాబాద్​-అగర్తలా ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. B5 కోచ్​లో పొగ వచ్చిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్​ దిగి కిందకు పరిగెత్తారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరి ప్రాణాలు కోల్పోలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు ఒడిశా ఘటనపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర పోలీసులు చేపట్టిన దర్యాప్తునకు సంబంధించి వివరాలు సేకరించారు. ఈ ప్రమాదం సాధారణంగా జరిగింది కాదని.. ఉద్దేశపూర్వకంగానే.. కుట్రతో ఎవరో సిగ్నలింగ్ వ్యవస్థలో మార్పులు చేసి ఉంటారన్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐని రంగంలోకి దించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news