యూపీలో నెలరోజుల పాటు మహాసంపర్క్‌ అభియాన్‌

-

ఓటర్లకు చేరవయ్యే లక్ష్యంతో సీఎం యోగి కొత్త కార్యక్రమం

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ తొమ్మిదేళ్ళ పాలన పూర్తి చేసుకుంది.ఈ క్రమంలో ఓటర్లకు మరింత చేరువ కావడానికి యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహాసంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా టిఫిన్‌ పర్‌ చర్చా చేపట్టారు. రాష్ర్టంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.నెలరోజుల ఓటరు ప్రచారంలో భాగంగా నిర్వహించిన మొదటి ‘టిఫిన్ పర్ చర్చ’ కార్యక్రమాన్ని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించింది.

 

ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం ఆదిత్యనాథ్‌, ఇతర నేతలు టిఫిన్‌ బాక్సుల్లో భోజనం చేస్తూ కనిపించారు.2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ యొక్క ప్రసిద్ధ “చాయ్ పే చర్చా” కార్యక్రమాల తరహాలో “టిఫిన్ పర్ చర్చా”లో, బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు వారి సొంత ఆహారాన్ని తీసుకురావాలని యోగీ చెప్పారు. అలా తెచ్చుకున్న టిఫిన్‌ బాక్సులు తింటూ పార్టీ వ్యూహాలపై చర్చించారు.అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు క్షేత్రస్థాయి కార్యకర్తలు పాల్గొని చర్చించాలని ఈ సందర్భంగా యోగీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందులో సీఎం యోగి మాట్లాడుతూ ”వంశపారంపర్యంగా మరియు కులతత్వంతో కూడిన ఇతర సాంప్రదాయ రాజకీయ పార్టీల నుండి భిన్నంగా, బిజెపి తనకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకోవాలి.

బిజెపి క్లబ్ పార్టీ కాదు, ఇది రాజవంశ పార్టీ కాదు, కులతత్వ పార్టీ కాదు-అని వ్యాఖ్యానించారు.ఈ సమావేశంలో ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఆదిత్యనాథ్ ఇలా అన్నారు: “ప్రధాని మోదీ స్ఫూర్తితో బీజేపీ నేడు కొత్త శిఖరాలను తాకుతోంది మరియు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా పేరు గాంచింది. భారతదేశం యొక్క ఆదర్శాలు మరియు విలువలకు బిజెపి అంకితమైందని, ఇది దేశంలోని గొప్ప వ్యక్తులను గౌరవిస్తుందని అన్నారు.

అలాగే కేంద్రంలోని తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపించిన ఆదిత్యనాథ్ సరిహద్దులు భద్రంగా ఉన్నాయని, భారత భూభాగంలోకి ప్రవేశించి భూమిని ఆక్రమించేందుకు ఎవరూ సాహసించడం లేదని అన్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నేర్చుకుందని,యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలుసు అని ఆదిత్యనాథ్ అన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం ఆదిత్యనాథ్ ట్వీట్ చేస్తూ, “ఈ సమావేశం చాలా విజయవంతమైంది మరియు సానుకూలంగా జరిగింది. ఇదే స్ఫూర్తితో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ నేతలు,కార్యకర్తలందరూ ప్రతి చోటా టిఫిన్‌ పర్‌ చర్చా నిర్వహించాలని సూచించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు మహాసంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలలోపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news