శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

-

మహా రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. శివసేన మంత్రి ఏకనాథ్ నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివసేన చీలిక దిశకు చేరగా, ఆ పార్టీ చీఫ్,సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహ వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మాత్రం చాలా గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నారు.

ముంబైకి తిరిగి వచ్చి ధైర్యాన్ని ప్రదర్శించాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు గౌహతి లో ఉండి మాట్లాడడం సరికాదన్నారు. వారు ముంబైకి తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలని సూచించారు. ఎమ్మెల్యేలందరికీ అబీష్టం అయితే(ఎంవిఏ) కూటమి నుంచి వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నామని సంజయ్ రౌత్ ప్రకటించారు. అయితే దానికోసం రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news