మూడు రిక్రూట్​మెంట్ కంపెనీలను బ్లాక్​లిస్టులో పెట్టిన TCS

-

తాత్కాలిక నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలపై మూడు రిక్రూట్​మెంట్ కంపెనీలపై టీసీఎస్ చర్యలకు ఉపక్రమించింది. ఆ మూడు సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. టీసీఎస్‌లో సబ్‌కాంట్రాక్టింగ్‌, తాత్కాలిక ఉద్యోగులను నియమించే వనరుల నిర్వహణ బృందం(ఆర్‌ఎమ్‌జీ)లోని సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఆయా సంస్థలు ప్రలోభ పెట్టి, తమ వ్యాపారాలు నడుపుకున్నాయన్నది ఆరోపణ.

సంస్థ ప్రధాన నియామక బృందానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదు. టీసీఎస్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 0.5-1% మాత్రమే ఆర్‌ఎమ్‌జీ ద్వారా చేరినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడిన ఐడీసీ టెక్నాలజీస్‌పై టీసీఎస్‌ నిషేధం విధించగా, మరో రెండు  సంస్థల తెలియరాలేదని పేర్కొన్నాయి. ఆర్‌ఎమ్‌జీ నుంచి నలుగురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను  తొలగించినట్లు తెలిపాయి. టీసీఎస్‌ సీఈఓ కె. కృతివాసన్‌, సీఓఓ నటరాజన్‌ గణపతి సుబ్రమణియన్‌లకు ఒక వేగు ద్వారా అందిన సమాచారంతో అంతర్గత దర్యాప్తు నిర్వహించగా, ఈ విషయాలు బయటపడ్డట్లు సమాచారం. ఆర్‌ఎమ్‌జీ గ్లోబల్‌ హెడ్‌ ఈఎస్‌ చక్రవర్తిని సెలవులో పంపగా.. హెర్‌ఆర్‌ కంపెనీల నుంచి కమీషన్‌ తీసుకున్న మరో అధికారి అరుణ్‌ జీకేను తొలగించారని ఆయా కథనాలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news