ఆర్థిక, ఆహార సంక్షోభంలో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధర పెట్టి కొందాం అనుకున్నా సరుకులు అభించే పరిస్థితి కనిపించడం లేదు. బియ్యం, పాలు, చికెన్, గుడ్లు, పెట్రోల్ , డిజిల్, గ్యాస్ ఇలా అన్నింటి ధరలు పెరిగాయి. డిమాండ్ కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో అక్కడ ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. పెట్రోల్, డిజిల్ కోసం కిలోమీటర్ల మేర గంటల తరబడి క్యూల్లో నిలుచుంటున్నారు ప్రజలు. దీనికి తోడు డిజిల్, బొగ్గు కొరతతో అక్కడ ప్రజలు తీవ్ర కరెంట్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 12 గంటలకు పైగా విద్యుత్ కోతలు ఉంటున్నాయి. ప్రజలు ఆందోళనకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సె అత్యవసర పరిస్థితిని విధించాడు. ఇదిలా ఉంటే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది. 40,000 టన్నుల డిజిల్ ను ప్రత్యేక ఓడలో శ్రీలంకకు పంపింది. ఈ రోజు సాయంత్రం వరకు శ్రీలంక వ్యాప్తంగా ఈ డిజిల్ ను సరఫరా చేయనున్నారు.కేంద్రం హమీ మేరకు ఇండియన్ ఆయిల్ మరో 6000 టన్నుల డిజిల్ ను పంపించనుంది. శ్రీలంక వ్యాప్తంగా డిజిల్ కొరత కారణంగా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. తాాజాగా భారత్ సాయంలో ఎంతో కొంత శ్రీలంక కష్టాలు తీరనున్నాయి.