తమిళనాడును వణికిస్తున్న కళ్లకలకలు.. రోజుకు 4000 పైగా కేసులు..

ఓ పక్క చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మరోపక్క తమిళనాడులో మద్రాస్‌ ఐ కేసులు పెరుగుతున్నాయి. తమిళనాట ప్రజలు మాద్రాస్‌ ఐ ముప్పుతిప్పలు పెడుతోంది. ఆందోళనకర స్థాయిలో ఈ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని సాక్షాత్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సాధారణంగా వర్షకాలంలో ఈ ‘మద్రాస్ ఐ’ ఇన్ఫెక్షన్ సమస్య ప్రారంభమవుతుంది. కానీ, ఈ సంవత్సరం ‘మద్రాస్ ఐ’ ఇన్ఫెక్షన్లు తమిళనాడులో ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి.

ఏంటీ మద్రాస్ ఐ?

ఇది కళ్లకు వచ్చే ఇన్ ఫెక్షన్. దీన్నే కంజక్టివైటిస్, కళ్లకలకలు అంటారు. ఎడెనోవైరస్(adenovirus) కారణంగా ప్రధానంగా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. 90% conjunctivitis ఈ వైరస్ కారణంగానే వస్తుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ సమస్య తమిళనాడును భారీగా ఇబ్బంది పెడుతుంది.. ఈ conjunctivitis ఇన్ఫెక్షన్ ఇతరులకు చాలా తొందరగా సోకుతుంది. కంటి నుంచి వచ్చిన స్రావాల ద్వారా ఇది వ్యాప్తిస్తుంది.

రోజుకు 4500 కేసులు..

తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు దాదాపు 4000 నుంచి 4500 conjunctivitis కేసులు నమోదవుతున్నాయంటే.. సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది.. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారు వెంటనే ఒంటరిగా ఉండాలని, వేరే వారితో కలవవద్దని, తద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.. ఈ ఇన్ఫెక్షన్ ఇప్పటివరకు 1.5 లక్షల మందికి conjunctivitis సోకిందని వెల్లడించింది. చెన్నైలోని కంటి ఆసుపత్రులకు రోజూ వందకు పైగా పేషెంట్ల చొప్పున వస్తున్నారు. చెన్నైతో పాటు సేలం, ధర్మపురి జిల్లాల్లో ఈ conjunctivitis ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది. చెన్నైలోని అగర్వాల్ ఆసుపత్రికి రోజూ 500 మంది పేషెంట్లు వస్తున్నారని ఆ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

కారణం ఏంటి..?

వర్షాల కారణంగానే మద్రాస్ ఐ సమస్య ఎక్కువగా ఉందని వైద్యారోగ్య శాఖ అంటోంది. తమిళనాడులో ప్రస్తుతం ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, అల్పపీడన ప్రభావంతో ఈ నెలలో రెండు వారాలు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. ఎండ లేకపోవడం, సూర్యరశ్మి పడకపోవడం, తేమగా ఉండడంతో ఈ ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాప్తి చెందుతోంది.

ఇన్ఫెక్షన్ సోకినవారికి కళ్లు ఎర్రగా మారడం, కళ్లల్లో వాపు, కళ్ల నుంచి నీరు రావడ, కళ్లల్లో మంట.. మొదలైన లక్షణాలుంటాయి. ఈ ఇన్ఫెక్షన్ భారిన పడే వారిలో చిన్నపిల్లలే అధికంగా ఉన్నారట… పిల్లల్లో స్వల్ప జ్వరం కూడా ఉంటుందోని వైద్యులు అంటున్నారు..