దేశం మొత్తం తెలంగాణ మోడల్ అమలు కావాలి – సీఎం కేసీఆర్

-

నేడు మహారాష్ట్రలోని నాందేడ్ లో బిఆర్ఎస్ పార్టీ తొలిసారిగా రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరాల్లో మహారాష్ట్ర నాయకులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు కన్వీనర్లు, కోఆర్డినేటర్లు , ముఖ్యమైన మహిళా కార్యకర్తలు, పలువురు రైతు నేతలు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఆవిర్భావ లక్ష్యాలను శిక్షణ శిబిరాలలో వివరించారు సీఎం కేసీఆర్. తెలంగాణ మోడల్ మహారాష్ట్రకు ఎందుకు అవసరమనే అంశాన్ని ప్రస్తావించారు. దేశం మొత్తం మార్పు తేవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని.. దేశం మొత్తం తెలంగాణ మోడల్ అమలు కావాలన్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కావడంలేదని మండిపడ్డారు. అమూల్యమైన నీటిని వాడుకోలేక వృధా చేస్తున్నామని.. వ్యవసాయానికి నీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news