బిగ్ బ్రేకింగ్: రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఫ్రీ: కేంద్రం ప్రకటన

రాష్ట్రాలకు ఉచితంగా కరోనా టీకాను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సిన్ పై కాసేపటి క్రితం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో టీకా డోస్ ను 150 రూపాయలకు కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఇలా కొనుగోలు చేసిన వ్యాక్సిన్ ని ఫ్రీ గా రాష్ట్రాలకు అందిస్తామని చెప్పింది. రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వ్యాక్సిన్ డిమాండ్ కూడా పెరుగుతుంది.

ఇక వాక్సిన్ కావాలి అంటే రాష్ట్రాలు కొనుగోలు చేయాలని కేంద్రం షరతు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాక్సిన్ విషయంలో తెలంగాణా, కేరళ, పశ్చిమ బెంగాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాయి. ఏపీలో సిఎం వైఎస్ జగన్ 18 ఏళ్ళు పైబడిన వారికి వాక్సిన్ ఫ్రీ గా ఇస్తామని ప్రకటించారు.