దేశంలో వ్యాక్సిన్ ధర తగ్గుతుందా…?

కోవిడ్ -19 వ్యాక్సిన్ల దిగుమతిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మూడు నెలల పాటు మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ ఆక్సిజన్ మరియు అనుసంధానించబడిన పరికరాల దిగుమతిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం మరియు హెల్త్ సెస్‌ను మూడు నెలల కాలానికి తక్షణమే మాఫీ చేయాలని నిర్ణయించింది. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీనితో దేశంలో ఆక్సీజన్ ధరలు, వ్యాక్సిన్ ధరలు తగ్గే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా పాల్గొన్నారు. ఆక్సిజన్ క్యానిస్టర్, ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్, ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకులు, ఆక్సిజన్ సిలిండర్లు, క్రయోజెనిక్ సిలిండర్లు మరియు ట్యాంకులతో పాటు ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల ఇతర పరికరాల ధరలు తగ్గుతాయి.