మహిళలు ఆ సమయంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా ? అసలు నిజమేంటి ?

దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కూడా ప్రాముఖ్యత పెరిగింది. గతంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపని వారు సైతం ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ కు సంబంధించి అనేక ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే మహిళలు పీరియడ్స్ కు ఐదు రోజుల ముందు అలానే పీరియడ్స్ కి ఐదు రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవద్దని కూడా ఒక ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది.

ఆ సమయంలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో వేసుకోవద్దని ఆ మెసేజ్ లో ప్రచారం చేస్తున్నారు. పీరియడ్స్ సమయంలో టీ గా తీసుకుంటే రిస్క్ ఎక్కువగా ఉంటుందని దీని ద్వారా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది నిజం కాదని తెలుస్తోంది ప్రభుత్వం కానీ డాక్టర్లు గాని దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు కాబట్టి ఇది ఫేక్ మెసేజ్ అని అంటున్నారు.