ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275 గా రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ అటు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు మృతుల సంఖ్య. జనరల్ బోగీల్లో ప్రయాణించిన వారి శవాలను గుర్తించడంలోనే సమస్య తలెత్తుతోందని వెల్లడించింది రైల్వేశాఖ.
రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరించినా గుర్తించలేని శవాలను ఏం చేయాలన్న దానిపై గందరగోళంలో అధికారులు ఉన్నారని తెలిపింది. ఇక అటు భువనేశ్వర్ ఎయిమ్స్‌లో 150కి పైగా మృతదేహాలు ఉన్నాయని.. సామూహిక ఖననం చేసే ఆలోచనలో ఉంది రైల్వే శాఖ.
కాగా, ఒడిశా రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు’ కారణమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థపై మూణ్నెళ్ల క్రితం ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి హెచ్చరించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ వైఫల్యాన్ని ఆ ఉన్నతాధికారి గతంలోనే ఎత్తిచూపిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.