2024లో లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి గట్టి సవాలు విసిరేందుకు ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ” భారత్ జోడో” యాత్ర రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర నేడు కన్యాకుమారి ఆగస్తీశ్వరం నుంచి ప్రారంభమైంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాడ్, చతిస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్, పాల్గొన్నారు.
నేడు రాహుల్ గాంధీ ఈ పాదయాత్రలో భాగంగా 20 కిలోమీటర్లు నడవనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహిళలతో భేటీకానున్నారు రాహుల్ గాంధీ. ఈ పాదయాత్ర నేడు రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగించనున్నారు. రెండు విడతలుగా రాహుల్ గాంధీ పాదయాత్రను కొనసాగించనున్నారు.