పాక్ సైన్యాన్ని మట్టుబెట్టిన తాలిబన్లు

-

ఉగ్రవాదులు సైనికులపై విరుచుకుపడి మట్టుబెట్టడం కాస్తంత బాధాకర విషయం. సైనికులు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఉగ్రవాదులు వేచి చూస్తుంటారు. ఇలా చూస్తూ.. చూస్తూ… ఉండి తెగబడడం మనం చూస్తూనే ఉంటుంటాం. అసలు ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం సైనికులను మట్టుబెట్టడమే అని చాలా సందర్భాల్లో ప్రకటించారు. అలానే విరుచుకుపడుతున్నారు. ఎటువంటి జాలి, దయ లేకుండా ఊచకోత కోస్తున్నారు. కానీ సైనికులు ఉగ్రవాదుల మీద దాడి చేయాలంటే మాత్రం వాళ్లకు ఎన్నో అడ్డంకులు వస్తాయి.

పాకిస్తాన్ లో తాలిబన్లు మరలా తెగబడ్డారు. ఈ సారి ఏకంగా ఆర్మీ కెప్టెన్ నే మట్టుబెట్టారు. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్ తో పాటు మరో 15 మంది దాకా జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అనేక మంది జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్తాన్ లోని ఖైబర్ కనుమల్లో ఈ దాడి జరిగింది. సైన్యంపై తెహ్రీక్–ఏ–తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు తెగబడి ఈ దారుణానికి ఒడిగట్టారు. అత్యంత పాశవికంగా 15 మంది సైన్యాన్ని చంపేశారు. 15 మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా మరో 63 మంది సైనికులను తాలిబన్లు కిడ్నాప్ చేశారు.
ఇలా తాలిబన్లు తెగబడడం ఇది మొదటి సారి కాదు. పాక్ లో ఈ ఘటనలు తరచూ సంభవిస్తూనే ఉంటాయి. ఇలా దాడులు చేస్తున్నా ఎంతో మంది అమాయక సైనికులను పొట్టన పెట్టుకుంటున్నా కూడా తాలిబన్ల రక్త దాహం తీరడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news