అసెంబ్లీ ఎన్నికల ఐకాన్​గా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

-

దర్శకధీరుడు.. జక్కన్న.. ఎస్ ఎస్ రాజమౌళి మరో ఘనత సాధించారు. రాజమౌళి ఓ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. ఎలక్షన్ ఐకాన్​గా నియమితులయ్యారు. 2023 కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం రాయ​చూర్​ జిల్లాకు రాజమౌళిని ఎన్నికల ప్రచారకర్తగా నియమించింది. జిల్లాలోని ఓటర్లలందరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా రాజమౌళి అవగాహన కల్పిస్తారని ఈసీ వెల్లడించింది. రాయ​చూర్​ జిల్లా కలెక్టర్​ చంద్రశేఖర్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు.

రాజమౌళి.. రాయ​చూర్ జిల్లా, మానవి తాలుకాలోని అమరేశ్వర్​ క్యాంప్​కు చెందినవారు. ఆ తర్వాత ఆయన కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడింది. అందుకే రాయచూర్​ కలెక్టర్ చంద్రశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

“పలు విజయవంతమైన సినిమాలు తీసిన రాజమౌళి.. దేశంలోని చాలా మందికి సుపరిచితమే. అందుకే రాజమౌళికి ఈ బాధ్యతలకు అప్పగిస్తున్నాం. ప్రజలు ఆయనను సులువుగా గుర్తిస్తారు. రాజమౌళి ప్రచారం చేస్తే ఓటింగ్​ శాతం పెరిగే అవకాశం ఉంది. రాయ​చూర్​ జిల్లా ఎన్నికల ఐకాన్​గా ఉండేందుకు రాజమౌళి కూడా అంగీకరించారు” అని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news