ఒడిశాలోని బహానగా వద్ద పునరుద్ధరణ పనులు.. 15 రైళ్ల రద్దు

-

ఒడిశాలో ఇటీవల మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రైల్వే ట్రాక్​లు ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన బహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద పునరుద్ధరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హావ్‌డా వైపు రాకపోకలు సాగించే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 12న చెన్నై సెంట్రల్‌ – షాలిమార్‌ (12842)రైలు సర్వీసును పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది.

ఇవాళ సర్వీసులందించాల్సిన హైదరాబాద్‌-షాలిమార్‌ (18046); ఎర్నాకుళం-హావ్‌డా (22878), సంత్రగాచి-తాంబరం(22841), హావ్‌డా-చెన్నై సెంట్రల్‌ (12839) రైలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే, ఈ నెల 13న సంత్రగాచి-చెన్నై సెంట్రల్‌(22807), హావ్‌డా- ఎఎంవీటీ బెంగళూరు(22887), షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ (22825), షాలిమార్‌-హైదరాబాద్‌(18045), సికింద్రాబాద్‌-షాలిమార్‌(12774), హైదరాబాద్‌-షాలిమార్‌ (18046), విల్లుపురం-ఖరగ్‌పుర్‌(22604) రైలు సర్వీసులు; 14వ తేదీన ఎస్‌ఎంవీటీ బెంగళూరు-హావ్‌డా (22864), భాగల్పుర్‌-ఎస్‌ఎంవీటీ బెంగళూరు(12254), షాలిమార్‌-సికింద్రాబాద్‌ (12773) సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news