‘ఆదిపురుష్‌’ టీమ్ మరో ఆఫర్.. ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ రాఘవ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ సీతగా, బీ టౌన్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా.. చారిత్రక గాథ రామాయణం ఆధారంగా.. తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ షురూ చేసింది. ముఖ్యంగా రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటికీ హనుమంతుడు విచ్చేస్తాడు అనే నమ్మకంతో.. ‘ఆదిపురుష్‌’ ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మంచి కార్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రముఖ ఈవెంట్స్‌ ఆర్గనైజింగ్‌ సంస్థ శ్రేయస్‌ మీడియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు ఇవ్వదలచుకున్నామని ఆదివారం ప్రకటించింది. తన సొంత డబ్బులతోనే ఈ టికెట్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్టు శ్రేయస్‌ మీడియా అధినేత శ్రీనివాస్‌ మీడియాతో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news