దేశంలో ఏడాదిన్నర లో యుద్ధప్రాతిపదికన 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పలు ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించడం పై కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.” ప్రభుత్వ రంగ సంస్థల్లో దేశంలోని 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక భారత్ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతగా ఉండబోతుందో మోదీ నిర్ణయాన్ని బట్టి తెలుస్తోంది.” అని పీయుష్ గోయల్ అన్నారు.
” న్యూ ఇండియా కు దేశ యువశక్తే ఆధారం. యువత సాధికారత కోసం మోదీ నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. ఏడాదిన్నర లో యుద్ధ ప్రాతిపదికన పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఆయన తీసుకున్న నిర్ణయంతో యువతలో ఆత్మవిశ్వాసం, బంగారు భవిష్యత్తు పై నమ్మకం నెలకొంటాయి. ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నందుకు మోదీకి కృతజ్ఞతలు” అని అమిత్షా ట్వీట్ చేశారు. మన దేశ యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారంటూ కేంద్ర మంత్రులు.. స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ కొనియాడారు.