ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆకాశనికెత్తేస్తున్నారు యూపీ సీఎం యోగి అదిత్యనాథ్. తొమ్మిదేళ్ల పాలనలో దేశ ప్రతిష్ట పెరిగిందని, దేశ భద్రత అంతర్గతంగానే కాకుండా బాహ్యంగాను పెరిగిందని యోగి కొనియాడారు.ముఖ్యంగా యూపీ అనేక విధాలుగా బలపడిందని చెప్పిన ఆయన అత్యధిక ప్రయోజనాలు ఉత్తర ప్రదేశ్ కే ఓనగూరాయని చెప్పుకొచ్చారు.
ప్రధాని మోడీ వలన ప్రపంచ వ్యాప్తంగా భారత్ పట్ల ఉత్సుకత పెరిగింది.ప్రపంచం మొత్తం మోడీ దార్శనిక నాయకత్వానికి ఆకర్షితమవుతోంది. ఇది జగమెరిగిన సత్యమే. మోడీ ప్రభావం విదేశాల్లో నే కాదు స్వదేశంలోను అనేకమంది అభిమానులను సంపాదించింది. తాను కూడా మోడీకి వీరాభిమాని అని చెప్పుకుంటారు యూపీ సీఎం యోగి. మోడీ తరువాత దేశానికి ప్రధాని అయ్యే అవకాశాలు యోగికే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీని యోగి ప్రశంశలతో ముంచెత్తారు. తొమ్మిదేళ్ల పాలనలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు మోడీ సాధించిన విజయాలను యోగి మాటల్లో విందాం..
జమ్మూ & కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేదా నక్సల్స్, మావోయిస్టుల హింస ప్రభావిత ప్రాంతాలో శాంతి నెలకొల్పిన విధానం శ్లాఘనీయమని అన్నారుకావచ్చు. తీవ్రవాదాన్ని ప్రభుత్వం విజయవంతంగా నియంత్రించింది. భద్రత పరంగా దేశంలో కొత్త ఆశ, విశ్వాసం ఏర్పడింది.
“భారతదేశం ప్రస్తుతం తన 140 కోట్ల మంది పౌరుల అవసరాలను తీర్చడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే నిర్మించబడ్డాయి, అయితే కేవలం తొమ్మిదేళ్లలో అదనంగా 74 నిర్మించబడ్డాయని చెప్తూ ఇదంతా మోడీ క్రెడిట్ అన్నారు.
మహమ్మారి కోవిడ్ వ్యాపిస్తున్న సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది, వ్యాక్సిన్ తయారీతో సహా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేసిన విధానాన్ని ఆయన గుర్తు చేశారు. 2040 నాటికి జిడిపి 28 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నందున రానున్న రెండేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆయన అన్నారు. విమానాశ్రయాలు ప్రపంచ స్థాయిలో మారడమే కాకుండా రైల్వే స్టేషన్లను కూడా పునరుజ్జీవింపజేస్తున్నాయని ఉద్ఘాటించారు.