భారత్​లో అమెరికా స్డూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం

-

ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిదో విద్యార్థి వీసా వార్షికోత్సవాన్ని భారత్‌లోని అమెరికా ఎంబసీ గురువారం నిర్వహించింది. దిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి కేంద్రాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు మొదలు పెట్టింది. దీంతో దేశ రాజధానిలోని యూఎస్‌ ఎంబసీ వెలుపల భారీ క్యూ కనిపించింది. గత ఏడాది రికార్డు స్థాయిలో లక్షా 40వేల విద్యార్థి వీసాలను జారీ చేసింది. ఈసారి కూడా అదేస్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది.

2023తో పోలిస్తే ఈ ఏడాది కూడా వీటి సంఖ్య అదే మాదిరిగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ తాత్కాలిక కాన్సుల్‌ జనరల్‌ సయ్యద్‌ ముజ్‌తబా అంద్రాబీ అన్నారు. గురువారం ఒక్కరోజే 4,000 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేశామని తెలిపారు. మరోవైపు విద్యార్థి వీసాలకు అమెరికా అధిక ప్రాధాన్యం ఇస్తుందని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల ప్రజాసంబంధాలు కలకాలం ఉంటాయన్న విషయం తమకు తెలుసునన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news