వాహనాల విషయంలో కీలక నిర్ణయం.. పదిహేనేళ్ళకి మించితే అంతే సంగతి.

-

వాహనాల కాల పరిమితి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బడ్జెట్ లో చర్చించిన దాని ప్రకారం, ప్రైవేటు వాహనాల కాలపరిమితి 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. అలగే కమర్షియల్ వాహనాల కాల పరిమితి 15ఏళ్ళుగా నిర్ణయించారు. అంటే ఈ కాల పరిమితిని దాటితే ఖచ్చితంగా ఫిట్ నెస్ టెస్ట్ చేయించాల్సిందే. లేదంటే పక్కన పడేయాల్సిందే అని చెబుతున్నారు. కాల పరిమితి దాటిపోయిన వాహనాల కారణంగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అందువల్ల అలాంటి వాటిని రోడ్డు మీదకి తీసుకురాకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నామని తెలిపారు.

మీ కారు 20ఏళ్ళకి పైబడినదైతే జాగ్రత్తగా ఉండండి. మీరు ఉపయోగిస్తున్న కమర్షియల్ వాహనం 15ఏళ్ళు దాటిపోతే వెంటనే ఫిట్ నెస్ చేయించుకోండి. లేదంటే మరికొద్ది రోజుల్లో కాలం చెల్లిన వాహనాలు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. రవాణా భద్రత విషయంలో ఇది కీలక అంశంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news