విపక్షాలకు వెంకయ్య మరో షాక్…!

వ్యవసాయ సంబంధ బిల్లుల ఆమోద సమయంలో రాజ్యసభ లో ఆందోళనకు దిగిన 8మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. డెరెక్ ఒబెరైన్, సంజయ్ సింగ్, రాజు సత్వ, రిపున్ బోర, డోళ సేన్, కేకే రాగేష్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరిన్ కరీం లపై వారం పాటు సస్పెన్షన్ వేటు వేసారు చైర్మన్ వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభా సాంప్రదాయాలను ఎవరు అయినా పాటించాలని స్పష్టం చేసారు.

అయితే పార్లమెంట్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని ఆరోపణలు చేస్తూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ పై విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి. ఈ తీర్మానాన్ని ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు తిరస్కరించి విపక్షాలకు షాక్ ఇచ్చారు. సరైన ఫార్మట్ లో లేదని తిరస్కరిస్తున్నట్టు చెప్పారు.