ఉచిత పథకాలు కొనసాగితే.. ఆర్థిక సంక్షోభం తప్పదు -వెంకయ్య నాయుడు

-

రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధం సరికాదని..పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించే విధంగా సంస్కరణలు అన్నారు. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే విషయంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

విధి నిర్వహణలో ఏమైనా అనుమానాలొస్తే రాజ్యాంగంతో పాటు ఆత్మప్రబోధం మేరకు పనిచేయాలని పిలుపునిచ్చారు వెంకయ్య నాయుడు.రాజకీయ సిద్ధాంతాలు, ఇతర కోణాల్లో కాకుండా నిజాయితీ, సత్యసంధతలకే కట్టుబడి ఉండాలన్నారు.రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధం విషయంలో వస్తున్న విమర్శలపైనా ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తంచేశారు.

రాజకీయ, సిద్ధాంత కోణంలో కాకుండా నైతికత ఆధారంగా లబ్ధిదారులకు మేలు చేయా లి…కొన్ని రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ఉచితాలను, ఆర్థిక పరిస్థితికి మించిన తాయిలాలు అని పేర్కొన్నారు.ఇది రానున్న రోజుల్లో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై పెను ప్రభావం అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version