ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్ మిషిన్ కొనాలనుకుంటున్నారా..? సరైన ప్రొడక్ట్‌ను ఇలా ఎంచుకోండి..!

-

భారతదేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు నిండిపోయాయి. ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీంతో చాలా మంది ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నాయి. అయితే కరోనా విజృంభణ వేళ ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్ మిషిన్ల వాడకం చాలా వరకు పెరిగింది. కరోనా బాధితులకు ఆక్సిజన్ అవసరం చాలా ముఖ్యం. అందుకే ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ మిషిన్‌ను ఇంట్లో తెచ్చుకుంటే.. ఇంట్లో సాధారణ ఆక్సిజన్ స్థాయి కంటే ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఆక్సిజన్ నిల్వ పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్
ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్

ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్ ఎప్పుడు ఉపయోగించాలి..?
కరోనా బాధితులకు ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కాదు. వీరికి 94 శాతం ఆక్సిజన్ అందదు. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోవడంతో శరీరంలోని అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలోనే ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్‌ను ఉపయోగిస్తారు. ఈ థెరపీ ద్వారా సులభంగా కరోనా బాధితుల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచవచ్చు. నాసికా కాన్యులా ద్వారా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేస్తారని, దీంతో వారి శరీరంలో ఆక్సిజన్ సాంద్రత పెరుగుతుందని ఢిల్లీలోని బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ ఎండీ, సీఈఓ సునీల్ ఖురానా తెలిపారు. ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్‌లు ఎయిర్ కండిషన్ (ఏసీ) మిషిన్ లాగానే పనిచేస్తాయి. ఇవి గాలి నుంచి ఆక్సిజన్ తీసుకుని.. ఫిల్టర్ చేసి విడుదల చేస్తుందని ఫరీదాబాద్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ హెచ్ఎండీ, సీనియర్ కన్సల్టెంట్ పల్మోనాలజీ డాక్టర్ రవిశేఖర్ తెలిపారు.

ఈ యంత్రాలు ఎలా పని చేస్తాయి..?
ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్ గాలిలోని ఆక్సిజన్‌ను వేరు చేస్తాయి. ఇది నాసికా కాన్యులా ద్వారా బాధితులకు నేరుగా ఆక్సిజన్ చేరవేస్తాయి. ఆక్సిజన్ సాంద్రత పెరగడంతో ప్యూర్ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కరోనాతో బాధపడేవారికి ఈ యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్ మిషిన్లు ఆక్సిజన్ సిలిండర్ల కంటే ఎంతో మేలైనవి. వీటి ధర మార్కెట్‌లో రూ.40 వేలు నుంచి రూ.90 వేల వరకు ఉంటుంది. వీటిలో విద్యుత్, నిర్వహణ వ్యయం, ఫిల్టర్లు, జల్లెడ పడకలు మాత్రమే ఉపయోగపడతాయి. ఇవి 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి.

ఆక్సిజన్ మిషిన్ ఉపయోగించేటప్పుడు..
ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల ఆక్సిజన్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ గాలిలో 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. కానీ ఆక్సిజన్ కాన్సెన్‌టాక్టర్ వల్ల 95 శాతం ఆక్సిజన్ అందుతుంది. ఇది గాలిలోని ఇతర వాయువులను పీల్చకుని ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. కరోనా బాధితుడికి ఎఫ్ 1 లీటర్ ఆక్సిజన్ అందించినట్లయితే.. అతడి ఊపిరితిత్తులలోని ఆక్సిజన్ 24 శాతం పెరిగిందని పరిశోధకులు తెలిపారు. 2 లీటర్లతో 28 శాతం, 10 లీటర్లతో 60 శాతం ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. అయితే ఆక్సిజన్ అందించేటప్పుడు వైద్యుల సలహా తీసుకుని వాడాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news