Natyam movie Review: టాలీవుడ్ లో ఇప్పడూ నిజజీవితాల ఆధారంగా తెరకెక్కుస్తున్న బయోపిక్ లు, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల హావా నడుస్తుంది. అవే ప్రేక్షకుల అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తెరకెక్కిన చిత్రం నాట్యం. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి సంధ్యారాజు నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం ‘నాట్యం’. ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు.
నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రం నుంచి తొలుత విడుదల చేసిన టీజర్, ట్రైలర్లకి మంచి స్పందన లభించడం.
టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకోవడం తో చిత్రంపై మొదట నుంచే పాజివిట్ వచ్చింది. ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.
అదే తరుణంలో ఈ చిత్రం గురించి.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు ప్రమోట్ చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. జనాల్లో ఆసక్తిని రేకెత్తించేలా చేసాయి. మరి ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..
కథ: సితార (సంధ్యారాజు) చిన్ననాటి నుంచి మంచి డ్యాన్సర్ కావాలని కోరిక. ఆ కోరికతో కాదంబరి అనే నాట్య కళాకారిణి స్ఫూర్తితో నాట్యం నేర్చుకుంటుంది సితార. ఆమె గురువు (ఆదిత్య మీనన్) సమక్షంలో ఈమె కాదంబరి కథని చెబుతూ నాట్య రంగ ప్రవేశం చేయాలనేది అనుకుంటుంది. కానీ ఆ గురువు ఒప్పుకోడు. ఇదిలా ఉంటే.. సితార గ్రామానికి రోహిత్ (రోహిత్ బెహల్) యువకుడు. వస్తాడు..
ఆ యువకుడికి కూడా డ్యాన్స్ అంటే.. చాలా ఇష్టం . ఈ క్రమంలో సితారతో రోహిత్ కు పరిచయం ఏర్పడుతుంది. ఈ కథలో కాదంబరి ఎవరు? ఆమెను సితార ఎందుకు ఈ ప్రపంచానికి ఎందుకు పరిచయాలను కుంటుంది. సితార చేస్తున్న ప్రయత్నాన్ని తన గురువు ఎందుకు వ్యతిరేకిస్తారు? చివరికి ఏం జరిగింది? క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపిస్తారు. అలాగే.. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి? అనేది తెలియాలంటే ఈ ‘నాట్యం’ చూడాల్సిందే..!
ఇక నటి నటుల విషయానికి వస్తే… సంధ్యారాజు నిజ జీవితంలోనూ అద్భుతమైన కూచిపూడి నాట్యకారిణీ
అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఆమెకు తగ్గ పాత్ర రావడంతో తన అనుభవాలను రంగరించి ఆమె పాత్రకు ప్రాణం పోసింది. ఆమె పలికించిన హావభావాలు థియేటర్ నుండీ బయటకి వచ్చాక కూడా ప్రేక్షకుల్ని వెంటాడతాయి అనడంలో సందేహం లేదు. ఇక రోహిత్ బెహల్ నటన బాగుంది. కానీ ఆయన పాత్రకు అంతా స్కోప్ లేదు. ఇతని పాత్ర ఎంత వరకు గుర్తుంటుంది? అనేది కచ్చితంగా చెప్పలేము.
ఇక ఆదిత్య మీనన్.. తన కెరీర్లో సూపర్ బూపర్ హిట్ చిత్రం నాట్యం అలాగే.. సుధాకర్, భానుప్రియ వంటి మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రలకి న్యాయం చేశారనే చెప్పాలి. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం మరో హైలెట్ .. ఆయనకే ఎక్కువ మార్కులు వేయాలి. ప్రతీ సీన్ కు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ సంగీతాన్ని అందించాడు. సాహిత్యం కూడా చాలా బాగుంది. మొత్తం మీద ఇలాంటి కథని తెరకెక్కించాలి అంటే.. ముఖ్యంగా అనుభవంతో పాటు ధైర్యం ఉండాలి…
అలాగే.. కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రతిది విజువల్ ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు కెమెరా మ్యాన్. అలాగే..తొలి ప్రయత్నంలో దర్శకుడు రేవంత్ కోరుకొండ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు.ఎడిటింగ్ కూడా ఇతనే కావడం మరో విశేషం. అయితే ఇక్కడ ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇక నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.అందుకు సంధ్యా రాజుని కూడా మెచ్చుకోవాల్సిందే. ప్రతీ ఫ్రేమ్ లోనూ ఆమె ప్యాషన్ కనిపిస్తుంది. ఓవరాల్ గా నాట్యం చిత్రంతో అక్కడక్కడా కొన్ని బోరింగ్ సీన్ ఉన్న క్లాస్ ఆడియన్స్ మెప్పించగల చిత్రమే..!
నటీనటులు: సంధ్యా రాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ తదితరులు
కథ, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, దర్వకత్వం: రేవంత్ కోరుకొండ
మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్
బ్యానర్: నిశ్రింకళ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2021-10-22