హరిహరకృష్ణ కస్టడీపై నేడు రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అబ్దుల్లాపూర్‌మెట్‌ హత్య’ కేసులో ఆశ్చర్యపోయే విషయాలు బయట పడుతున్నాయి. నవీన్‌ను స్నేహితుడైన హరిహర కృష్ణ దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యకు కేవలం కక్ష ఒకటే కారణం కాదని పోలీసులు భావిస్తున్నారు.

నిందితుడు మత్తులోనే ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆ సమయంలో గంజాయి, మాదకద్రవ్యాలు తీసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు.. హరిహరకృష్ణ ప్రేమించిన యువతి.. కౌన్సిలింగ్‌ ఇచ్చినా కేసు విషయంలో.. నోరు మెదపడం లేదని పోలీసులు తెలిపారు.

ఆ నేపథ్యంలో ఈ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అందుకోసమే ఈ కేసులో నిందితుడైన హరిహరకృష్ణను 8 రోజుల కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కోర్టును పోలీసులు కోరారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. హరిహరకృష్ణ కస్టడీపై నేడు రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news