Nayanthara: నయనతార పెళ్లి టీజర్ రిలీజ్.. అప్ డేట్ ఇచ్చిన నెట్‌ఫ్లీక్స్..!

-

ఇటీవలే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నయనతార తాను ప్రేమించిన ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట హనీమూన్‌ ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తోంది. అయితే, పెళ్లికి భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ పెళ్లి ఎలా జరిగింది? ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అభిమానులు చూడలేకపోయారు. ఈ జంట కాస్త కొత్తగా ఆలోచించింది పెళ్లిని ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఓ డాక్యుమెంటరీగా సిద్ధం చేసింది.

దీనికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించడం విశేషం. తాజాగా ఈ పెళ్లి డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో నయనతార పెళ్లికి సిద్ధం కావడం, విగ్నేష్ శివన్, నయనతో ఎలా ప్రేమలో పడ్డారో చెప్పడం లాంటి విషయాలను చూడొచ్చు. పూర్తి డాక్యుమెంటరీలో నయనతార చిన్నతనం నుంచి పెళ్లి వరకు సాగే ప్రయాణాన్ని చూపించనున్నారు. పెళ్లి వేడుక డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ రూ.25 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేది మాత్రం నెట్ ఫ్లిక్స్ ప్రకటించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news