BREAKING : నీరజ్ చోప్రా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లోనూ అదే ధోరణి కొనసాగించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు నీరజ్ చోప్రా.
పురుషుల జావెలిన్ ఫైనల్స్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా 88.13 మీటర్లు విసిరి 4వ త్రోతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ తన నాల్గవ ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి ఈ ఘటన అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించేందుకు భారత్‌కు 24 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. నీరజ్ ఈ ఘనత సాధించడంపై ఇండియన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
World Athletics Championships: India's Neeraj Chopra secures 2nd position, wins silver medal with his 4th throw of 88.13 meters in the men's Javelin finals pic.twitter.com/TOy1P8gJTz
— ANI (@ANI) July 24, 2022