Kiran Abbavaram : “నేను మీకు బాగా కావాల్సినవాడిని” మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

-

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఈ మధ్యకాలంలో ఎంతోమంది కుర్రాళ్ళు హీరోగా పరిచయం అవుతున్నారు. అయితే అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా గ్రాండ్ ఎంట్రీ ని అందుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో హైలైట్ అయిన కుర్రాలలో రాయలసీమ చిన్నోడు కిరణ్ అబ్బవరం ఒకడు. “రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం…. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.


రాజావారు రాణి గారు సినిమా తర్వాత “ఎస్ ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసాడు. తాజాగా సమ్మెతమేతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించాడు. ఇక లెటెస్ట్‌ గా “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” అంటూ డిఫరెంట్ టైటిల్తో వచ్చేసాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తిరగకుతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం కు జోడిగా సంజన ఆనంద్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news