ఇండియా UPI డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ ని ఉపయోగించే మొట్టమొదట దేశం నేపాలే..!

-

ఇండియా యుపీఐ సిస్టంని నేపాల్ కూడా త్వరలోనే అనుసరించనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయం గురువారం నాడు తెలిపింది. ఇది ఆ దేశం యొక్క డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

 

upi

నేపాల్ లో ఈ సేవలను ప్రవేశపెట్టడానికి NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL), నేపాల్‌లో సేవలను అందించడానికి గేట్‌వే పేమెంట్స్ సర్వీస్ (GPS) మరియు మనం ఇన్ఫోటెక్‌లతో చేతులు కలిపింది. దీనితో నేపాల్ లోని డిజిటల్ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఇంటర్‌ఆపరబుల్ రియల్ టైమ్ పర్సన్-టు-పర్సన్ (P2P) మరియు పర్సన్-టు-మర్చంట్ (P2M) లావాదేవీలను తీసుకు రానున్నట్టు తెలిపారు.

ఇండియా యుపీఐ సేవలను పొందుతున్న మొట్టమొదటి దేశం నేపాలే. బ్యాంక్ ఖాతాలు మరియు వ్యాపారి చెల్లింపుల మధ్య ట్రాన్సక్షన్స్ తక్కువ సమయంలోనే జరపచ్చని… ఇలా చేతులు కలిపి ముందుకు వెళ్లడం వలన నేపాల్ లో చెల్లింపులు ఈజీగా చేసుకోవచ్చని తెలిపారు. నేపాల్ లో ఈ కొత్త విధానాన్ని తీసుకుని వస్తే డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో సహాయపడుతుంది.

అలానే ఇది ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని GPS యొక్క CEO రాజేష్ ప్రసాద్ మానంధర్ అన్నారు. ఇది ఇలా ఉంటే 2021లో, UPI USD 940 బిలియన్ల విలువైన 3,900 కోట్ల ఆర్థిక లావాదేవీలను ప్రారంభించింది, ఇది భారతదేశ GDPలో దాదాపు 31 శాతానికి సమానం.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ”మనం” ఎల్లప్పుడూ ఎన్నో మార్పులు చేస్తూ వచ్చింది. ఈ భాగస్వామ్యం నేపాల్‌లో ట్రాన్సక్షన్స్ విధానంలో మార్పు తీసుకొస్తుందని అడ్డంకులను తొలగిస్తుందని మేము నమ్ముతున్నాము అని మనమ్ డైరెక్టర్ నాగ బాబు రామినేని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news