ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ (Aadhaar) కూడ ఒకటి. చాలా పనులకి ఆధార్ కార్డు ప్రూఫ్ తప్పని సరిగా ఉండాలి. ఆధార్ అనేది 12-అంకెల సంఖ్య యొక్క ప్రత్యేక గుర్తింపు సంఖ్య మరియు దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా యుఐడిఎఐ జారీ చేస్తుంది.
అలానే పాన్ కార్డు కూడా మనకి చాలా అవసరం. ఈ పాన్ కార్డు అనేది 10-అంకెల ఆల్ఫా న్యూమరిక్ సంఖ్య మరియు ఆదాయపు పన్ను విభాగం కేటాయించింది. ఈ పాన్ కార్డు ఫైనాన్స్ సంబంధిత పనిని పూర్తి చేయడానికి చాలా అవసరం.
అయితే ఈ రెండిటినీ తప్పక లింక్ చెయ్యాలి. ఒకవేళ రెండు పత్రాలను లింక్ చేయలేదు అంటే పాన్ కార్డు ‘పనిచేయనిది’ గా మారుతుందని గమనించండి.
అంతే కాదు 10,000 జరిమానా విధించబడుతుంది. కనుక తప్పని సరిగా రెండిటినీ లింక్ చెయ్యండి. పైగా పాన్‌ను ఆధార్ తో లింక్ చేయడం పెద్ద కష్టమైనా పనేం కాదు. కొద్ది నిమిషాల్లోనే డిజిటల్‌గా లింక్ చేయవచ్చు. లింక్ చేసారా..? లేదా..? అనేది గుర్తులేకపోతే ఇలా చెయ్యచ్చు. దీనితో మీ ఆధార్ మరియు పాన్ కార్డు లు లింక్ అయి ఉన్నాయా? లేదా ? అనే సంగతి మీకు తెలిసిపోతుంది.
దీని కోసం మొదట మీరు ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి, ఆదాయపు పన్ను విభాగం యొక్క అధికారిక సైట్ www.incometax.gov.in ని ఓపెన్ చెయ్యండి.
ఆ తరువాత వెబ్‌సైట్ హోమ్‌పేజీలో త్వరిత లింకుల విభాగం కింద ‘Link Aadhaar’ అనే ఆప్షన్ ఉంటుంది.
ఇప్పుడు ఆ ‘Link Aadhaar’ కింద ‘Know About your Aadhaar PAN linking Status’ అని కనపడుతుంది. మీరు దానిని క్లిక్ చేయండి.
ఇప్పుడు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పాన్ మరియు ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయండి.
మీరు వివరాలను నింపిన తర్వాత, ‘View Link Aadhaar Status’ అని వస్తుంది. దాని పై క్లిక్ చేయండి.
మీ ఆధార్-పాన్ యొక్క స్టేటస్ వెబ్‌సైట్‌లో కనపడుతుంది అంతే.