దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు కఠినతరం చేశారు. గడిచిన 24 గంటల్లో 14,917 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 1,98,271 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అలాగే 32 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,27,069కు చేరింది.
ఇప్పటివరకు 4.36 కోట్ల మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,17,508 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 25,50,276 మందికి వ్యాక్సినేషన్ అందించారు. దీంతో 208 కోట్ల మందికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అందజేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది.