దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పరిశోధనల్లో కరోనాకు కొత్త మందుని కనుక్కున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) నిర్వహించిన పరిశోధనల ప్రకారం, ఎఫ్‌డిఎ-ఆమోదించిన ఔషధం టీకోప్లానిన్ “వివాదాస్పద హెచ్‌సిక్యూ మరియు ప్రస్తుతం ఉపయోగిస్తున్న అనేక ఔషధాల కంటే కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడంలో కనీసం 10 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కు చెందిన కుసుమా స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ నిర్వహించిన పరిశోధనలో 23 ఆమోదించబడిన ఔషధాల కంటే ఇది బాగా పని చేస్తుందని పేర్కొన్నారు. “టీకోప్లానిన్ ప్రభావాన్ని వాడుకలో ఉన్న ఇతర ముఖ్యమైన ఔషధాలతో పోల్చినప్పుడు, మా ప్రయోగశాలలో… లోపినావిర్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందుల కంటే కూడా పది నుంచి 20 రెట్లు అత్యంత బాగా పని చేస్తుందని పరిశోధకులు వివరించారు. మన దేశంలో దీని వాడకం పెరగనుంది.