పంజాబ్‌లో కొత్త కూటమి.. పట్టం కడతారా?

-

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త కూటమి తెరపైకి వచ్చింది. గతంలో బీజేపీకి అధికారాన్ని పంచిన శిరోమణి అకాలీ దళ్ ఇప్పుడు పాత స్నేహితుడు బహుజన్ సమాజ్ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమైంది. పంజబ్‌లో బలమైన కూటమిగా ఉన్న అకాలీదళ్- బీజేపీ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారాయి.

రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తేవడమే బీజేపీ చేసిన పాపమని తాముఎప్పుడూ రైతుల పక్షమేనని శిరోమణి అకాలీదళ్ అంటోంది. పొత్తుకు సంబంధించి సీట్ల పంపకాలను సైతం రెండు పార్టీలు ఖరారు చేశాయి. మొత్తం117 సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో అకాలీదళ్ 97 సీట్లలో, బీఎస్పీ 20 పీట్లలో పోటీచేయాలని నిర్ణయించారు. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఎస్పీ-అకాలీదళ్ కలిసి పనిచేశాయి. రైతు వ్యతిరేక బిల్లుల విషయంలో బీజేపీ వ్యవహార శైలిపై మండిపడుతూ అకాలీదళ్ 2020 సెప్టెంబరులో ఎన్డీఏకి దూరమైంది .

పంజాబ్‌లో తొలి నుంచీ కాంగ్రెస్‌కు సరైన ప్రతిపక్షం శిరోమణి అకాలీ దళ్. 1971లో తొలిసారి సీఎంగా అకాలీ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ బాధ్యతలు చేపట్టారు. అలా మొత్తం ఐదుసార్లు సీఎంగా కొనసాగిన రికార్డ ఆయనది. 2007 నుంచి వరుసగా రెండుసార్లు ప్రజలు అకాలీ-బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారు. అయితే 2017లో కాంగ్రెస్‌పై నమ్మకంతో సీఎం అమరీందర్ సింగ్‌కు పగ్గాలు అప్పజెప్పారు.

స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు అకాలీలు. తొలిసారి మాత్రం 1971లో సీఎం పీఠం అకాలీకి దక్కింది. బీజేపీ-అకాలీ కూటమి 93 సీట్లు గెలుచుకుని 1997లో పంజాబ్‌లో బీజేపీ అధికారాన్ని పంచుకుంది. పంజాబ్ ఎన్నికల చరిత్రలో అకాలీలు అత్యధికంగా 75 సీట్లు గెలిచి ప్రజల మన్ననలు పొందారు. ఇక వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, అకాలీ, కాంగ్రెస్ పార్టీలకు అగ్ని పరీక్ష లాంటిది. మరి కొత్తకూటమి అధికారంలోకి వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news