ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మరో రూల్ ని కూడా చేర్చింది ఎన్నికల కమిషన్. జిహెచ్ఎంసీ ఎన్నికలలో అభ్యర్థులను బలపరిచే వ్యక్తి సంబంధిత వార్డులో ఓటరై ఉండాలని, అలానే అతనికి ఎటువంటి అనర్హతలు కలిగి ఉండరాదని ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో బలపరిచే వ్యక్తి అభ్యర్థి పోటీ చేస్తున్న వార్డులో రిజిస్టర్ అయిన ఓటరై ఉండాలని, అలానే పోటీ చేస్తున్న అభ్యర్థికూడా జీహెచ్ఎంసీ పరిధిలోని ఏదైనా వార్డునందు రిజిస్టర్ అయిన ఓటరు అయి ఉండాలని ఉత్తరవుల్లో పేర్కొన్నారు.
అభ్యర్థి తాను రిజిస్టర్ కాబడిన వార్డుకు సంబంధించిన పూర్తి ఓటరు లిస్టు లేదా అభ్యర్థి పేరు ఉన్న భాగాన్ని కానీ ఒక నామినేషన్ తో పాటు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక అభ్యర్థి ఒకటికంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్ దాఖలు చేయవచ్చు కానీ ఫైనల్ గా చూసుకుంటే ఒక్క వార్డులో మాత్రమే పోటీ చేయవలసి ఉంటుందని, మిగిలిన వార్డులలో అభ్యర్థిత్వాన్ని నిర్ణీత గడువులోగా ఉపసంహరించుకోవాలి లేదా ఆ అభ్యర్థి నామినేషన్ ను ఏ వార్డులోనూ పరిగణనలోకి తీసుకోకుండా ఉండేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.