కొత్త సంగీత సంచలనం “సుమంత్ బొర్ర”

-

కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు ప్రస్తుత యంగ్ జనరేషన్ యువకులు. చిన్న వయస్సులోనే సెలబ్రిటీగా మారిన అలాంటి యువకుని గురించి ఈరోజు తెలుసుకుందాం. సనాతన వైదిక ధర్మం పాటించే చిన్న కుటుంబంలో పుట్టి, ప్రస్తుతం తన పాటలతో అతను ,అందరిని ఉర్రూతలూగిస్తూ వున్నాడు. మ్యూజిక్ వరల్డ్ లో దిగ్గజ కంపెనీ అయిన ఆదిత్య మ్యూజిక్ వారే తనతో పాటల కోసం జట్టు కట్టారంటే తనలో ఎంత టాలెంట్ వుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం తాను పాడిన పాటలు యూట్యూబ్ లో లక్షలాది మంది చూస్తూ, వేలల్లో లైకులు సాధిస్తూ వున్నాయి. ఆ యువకుని పేరే సుమంత్ బొర్ర.

సుమంత్ బొర్ర కుటుంబం తెలంగాణ లో, ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ లో నివాసం వుండేది. వారిది మంచి సంప్రదాయాలు పాటించే బ్రాహ్మణ కుటుంబం. తండ్రి శ్రీనివాస్ గారు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ప్రభుత్వ ఉద్యోగి,తల్లి వాణి గారు గృహిణి. పువ్వు పుట్టగానే పరిమళించి నట్లు సుమంత్ చాలా చిన్న వయస్సులోనే మంత్రాలు,వేదాలు పురాణాలు అవలీలగా నేర్చుకున్నాడు. 5 ఏళ్ళ వయస్సులోనే మంత్రాలు తప్పులు పోకుండా లయబద్దంగా చెప్పడం నేర్చుకున్నాడు. ఇది చూసి వారి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారో ఎంతో ఆశ్చర్యపోయారు. తర్వాత ఇందిరా ప్రియదర్శిని స్కూల్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ చదువుతో పాటూ స్కూల్లో జరిగే ప్రతి ఆటలు పాటల పోటీల లోనూ, పాల్గొని అనేక బహుమతులు సాధించాడు.

అంతే కాకుండా అనేక రాష్ట్రాల పిల్లలు పాల్గొనే జాతీయ స్థాయి బాలోస్థవ్ పోటీలలో పాల్గొని వరసగా 11 సార్లు విజేతగా నిలిచాడు.ఇది బాలోస్థవ్ చరిత్ర లో ఒక చెరిగి పోని రికార్డ్. తర్వాత రాష్ట్ర స్తాయిలో జరిగిన అన్ని పోటీలలో పాల్గొని బహుతులు గెలుచుకున్నాడు. తర్వాత కాలేజి స్థాయిలో కూడా అనేక ప్రైజ్ లు పొందటం జరిగింది. తర్వాత డిగ్రీ చదువుల కోసం లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి వెళ్ళగా, అక్కడ తాను ప్రొఫెషనల్ సింగర్ గా మారడానికి బీజం పడింది. అక్కడ ఏర్పాటు చేసిన ఒక బ్యాండ్ తన జీవితాన్ని మలుపు తిప్పింది.

అక్కడ తన లాగే సంగీతం అంటే అభిరుచి వున్న మిత్రులు కొందరు దొరకడం జరిగింది.వారిలో ఒకరు వెంకటేష్ వుప్పల. ఇద్దరివీ ఒకేలా ఆలోచించే మనస్తత్వం, మ్యూజిక్ లో పైకి ఎదగాలనే తపనతో వున్నవారు కావడంతో ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఇక ఇద్దరూ పగలు చదువు కుంటూనే రాత్రి మాత్రం పాటల కోసం తమ ప్రాణం పెట్టి పని చేశారు. అలాగే చదువుని కూడా నిర్లక్ష్యం చేయని సుమంత్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. తర్వాత కాలంలో హైదరాబాద్ వచ్చి ఇండిపెండెంట్ సాంగ్స్ పై పనిచేశారు. సుమంత్ పాకెట్ మనీ కోసం అమ్మ నాన్న లపై ఆధార పడకుండా, ఎలాంటి భేషజాలు లేకుండా, చిన్న తనంలో నేర్చుకున్న పౌరోహిత్యం చేస్తూ వచ్చాడు. అలాగే తన చదువుతో, నైపుణ్యంతో లక్షల రూపాయల వేతనం ఇచ్చే సాప్ట్ వేర్ ఉద్యోగం కూడా సంపాదించాడు.

ఉద్యోగం వచ్చినా ఉదయం పౌరోహిత్యం చేస్తూ, తర్వాత జాబ్ కు వెళుతూ ఉండే వారు.అలాగే రాత్రిళ్ళు, సెలవు రోజుల్లో తనకు ఎంతో ఇష్టమైన పాటలను, తన మిత్రుడైన వెంకటేష్ పుష్పాల తో సాధన చేస్తూ వచ్చాడు.వీరి కృషి ఫలించి ఒక అద్బుత మైన పాటల ఆల్బమ్ తయారు చేశారు. దీనికోసం సుమంత్ బొర్రా తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు చేసి, పాట కంటే తనకి ఏదీ ఎక్కువ కాదని నిరూపించాడు.ఆ ఆల్బమ్ లో “ఎలా మరి ఇక రావా” పాట సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించింది .దానితో సుమంత్ బొర్రా టాలెంట్ ప్రపంచానికి తెలియడం జరిగింది.. ఇది చూసి దిగ్గజ సంస్థ అయిన ఆదిత్య మ్యూజిక్ వారు పాటల చేయడం కోసం సుమంత్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి ఇలాంటి అవకాశం సినిమాల్లో పాడే వారికి తప్ప, మిగిలిన వారికి అరుదుగా మాత్రమే లభిస్తుంది.అలాంటి అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా సుమంత్ భావించాడు.

దీంతో అదో పెద్ద బాధ్యతగా భావించి ఇంకా ఎక్కువగా కష్టపడటం చేశాడు. తాను పాటలు పాడడం తో పాటు తమ ఆల్బమ్స్ తయారు కావడానికి నిర్మాతగా గాను వ్యవహరించాడు. ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా ఆల్బమ్స్ తయారు చేసాడు. తాజాగా విడుదల చేసిన ఆల్బమ్ లో సుమంత్ పాడిన, “పడి పోయా “అనే పాట యూట్యూబ్ లో పెడితే లక్షలాది మంది విని ,పాట సూపర్ గా వుందని కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఈ పాట జనాలను మైమరచి పోయేలా చేస్తోంది. ఇది విన్న సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, ఫేమస్ సింగెర్స్ కూడా, సుమంత్ టాలెంట్ కు ఆశ్చర్య పోయి అభినందనలు తెలిపారు. అలాగే అనేక ఇంగ్లీష్, తెలుగు పత్రికలలో తన టాలెంట్ గురించి కథనాలు వచ్చాయి.

ప్రస్తుతం మరో 5 పాటలు రికార్డింగ్ దశలో వున్నాయి. అవి కూడా రిలీజ్ అయితే, రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తనకు ఫాలోయర్స్ విపరీతంగా పెరిగారు. తన అభిమానులు, సంగీత ప్రియులు తన పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణం కుటుంబం నుండి వచ్చిన సుమంత్ బొర్ర ,ఎవరి అండ దండలు లేకుండా స్వయం కృషి తో పైకి వచ్చాడు. ఇతని జీవితం ప్రస్తుతం వున్న యూత్ అందరకి ఆదర్శం. త్వరలోనే సుమంత్ బొర్రా సినిమాల్లో కూడా పాడి మనల్ని అలరించాలని, అలాంటి అవకాశం తొందరగా రావాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news