ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, జనసేన విడిపోవాలని కొందరు కోరుకుంటున్నారని.. అయితే విడదీసే సామర్థ్యం ఎవరికీ లేదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఈ రెండు పార్టీల కూటమి అధికారంలోకి రావలసిన ఆవశ్యకత ఉందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. 2024లో బిజెపి, జనసేన కలిసే పోటీ చేస్తాయని తెలిపారు. సీఎం వైయస్ జగన్ అభివృద్ధిని గాలికి వదిలేసారని విమర్శించారు.
అవినీతి సొమ్ముతో 175 స్థానాలు గెలుస్తామని సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని.. ఆ ఉచ్చులో పడొద్దని విపక్షాలకు సలహా ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి దీటుగా పోరాడుతుందని అన్నారు. సీఎం జగన్ తన సొంత జిల్లాలో కూడా ప్రజలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తో భేటీ తర్వాత సినిమా తీస్తున్నట్లు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారని.. ప్రస్తుతం ఆయన సినిమాలు చూసే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.