టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రేసులో కొత్త పేర్లు !

-

తెలంగాణలో ఇక రానున్న ఎన్నికలు ఏవైనా ఉన్నాయా అంటే అవి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అలానే ఎమ్మెల్సీ ఎన్నికలు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ స్థానం కోసం పోటీ ఉంటుంది. ఈలోపు కొందరు నేతలు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే ఆ రేసులో ఉన్న వారితో పాటు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పని చేసి ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్ పేరు ఈ జాబితాలో వినిపిస్తోంది. గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.

ఆయనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా పేరున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ తరపున పోటీ చేయలేనని సున్నితంగా తిరస్కరించడంతో బయటి నుండి ఆయనకు మద్దతివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక మరో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి మంత్రి మళ్ళా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి అవకాశం లభించే ఛాన్స్ ఉన్నట్టు టీఆర్ ఎస్ వర్గాల భోగట్టా. రాజశేఖర్ రెడ్డి మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మరి ఎమ్మెల్సీ పదవి మీద ఆశలు పెట్టుకున్న బొంతు రామ్మోహన్ వంటి వారికి అడియాశలు తప్పవా ? అనే వాదన కూడా వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news