ఫిబ్రవరి 1 నుంచి ఈ బ్యాంకులు కొత్త రూల్స్..!

-

బ్యాంకులకు రూల్స్ మారుతూ ఉంటాయి. అయితే ఫిబ్రవరి 1 నుంచి ఈ బ్యాంక్ రూల్స్ మారనున్నాయి. అయితే మరి ఆ బ్యాంకుల గురించి, కొత్త రూల్స్ గురించి చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల్లో కొత్త రూల్స్ రానున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ రూల్స్ ఫిబ్రవరి 1 నుంచి రానున్నాయి.

వీటి వలన కస్టమర్లపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే తప్పక తెలుసుకోవాలి. వచ్చే నెల నుంచి చెక్ క్లియరెన్స్ రూల్స్ మారబోతున్నాయి అని బ్యాంక్ ఆఫ్ బరోడా అంది. ఫిబ్రవరి 1 నుంచి చెక్ క్లియరింగ్‌కు కస్టమర్ అనుమతి తప్పనిసరి చేసింది. కనుక కస్టమర్ నుంచి కన్ఫర్మేషన్ లేదు అంటే చెక్ మళ్లీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది.

ఇక స్టేట్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఎస్‌బీఐ రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు స్లాబ్‌ను కొత్తగా ఏర్పాటు చేయబోతోంది. ఐఎంపీఎస్ మనీ ట్రాన్స్‌ఫర్‌కు ఇది వర్తిస్తుంది. వచ్చే నెల నుంచి రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఐఎంపీఎస్ ద్వారా పంపాలంటే అప్పుడు రూ.20 చార్జీ చెల్లించాలి. జీఎస్‌టీ అదనం.

ఇక ఇది ఇలా ఉంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూల్స్ కూడా మారనున్నట్టు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్‌స్టాల్‌మెంట్లు లేదంటే ఇన్వెస్ట్‌మెంట్లు ఫెయిల్ అయితే కస్టమర్స్ రూ.250 చెల్లించాల్సి వస్తుంది. డిమాండ్ డ్రాఫ్ట్‌ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి. కనుక కస్టమర్స్ ఈ రూల్స్ ని గమనించడం మంచిది.

 

Read more RELATED
Recommended to you

Latest news