SALAAR : ‘సలార్’ రెండు పార్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇక జాతరే!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “సలార్”. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి అయిందని సమాచారం.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సలార్ మూవీ రెండు పార్టులుగా రాబోతుందని… వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం రెండు పార్టులుగా రిలీజై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరోసారి అదే రిపీట్ కాబోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా సలార్ హ్యాష్ టాగ్ వైరల్ అవుతోంది. ఇక హోమ్ బలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగoదూర్ నిన్ను చూస్తున్న ఈ సినిమాకు రవి బసృత్ సంగీతమందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news