బాహుబ‌లి మానియా…టాలీవుడ్ లో న‌యా ట్రెండ్‌…

-

రాజ‌మౌళి చిత్రీక‌రించిన దృశ్య‌కావ్యం బాహుబ‌లి సినిమా వెయ్యికోట్ల రూపాయ‌ల‌కు పైగా వ‌సూలు చేసి భ‌ళా అనిపించింది.  బాహుబ‌లి 1 కంటే బాహుబ‌లి 2 ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో పాటుగా, బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు అన్న టాపిక్ కోసం రెండో భాగాన్ని ఎక్కువ మంది చూశారు.  ఏదైతేనేం సినిమా భారీ విజ‌యం సొంతం చేసుకుంది.  రాజ‌మౌళికి ఇండియ‌న్ స్టార్ డైరెక్ట్‌గా గుర్తింపు ల‌భిస్తే, ప్ర‌భాస్‌కు పాన్ ఇండియా హీరోగా ముద్ర‌వేసుకున్నారు.

ఈ సినిమా రెండు భాగాలు మంచి స‌క్సెస్ సాధించాయి.  అయితే, ఇప్పుడు ఇదే బాట‌లో మ‌రికొన్ని చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.  అందులో ఒక‌టి పుష్ప‌.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా చేస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాల‌ని యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది.  మొద‌టి భాగం ఈ ఏడాది డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ కానుక‌గా రాబోతున్న‌ది.  అంతేకాదు, దేశంలో పెద్ద హిట్‌గా నిలిచిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్‌2 తో పోటీ ప‌డుతున్న‌ది.  ఇక పుష్ప రెండో భాగాన్ని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది.  ఇందులో బ‌న్నీ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌గా క‌నిపిస్తుండ‌గా, ర‌ష్మిక మంధ‌న గిరిజ‌న యువ‌తిగా న‌టిస్తోంది.  సుకుమార్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా 5 భాష‌ల్లో చిత్రీక‌రిస్తున్నారు.  పుష్ప కూడా రెండు భాగాల్లో హిట్ట‌యితే, మ‌రికొన్ని చిత్రాలు కూడా అదే బాట‌లో న‌డ‌వ‌డం ఖాయ‌మ‌ని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news