2020 అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తోచ్చేది కరోనా.. కరోనా.. కరోనానే. ఇది ప్రతీ రంగాన్ని కుదిపేసింది. మానవ శైలిలో అనేక మార్పులు తీసుకొచ్చింది కూడా. వింధులు లేవు, వినోదాలు లేవు.. సరదా కోసం సినిమాలు లేవు, ఇళ్లే కార్యాలయాలుగా మారిపోయాయి. లాక్‌డౌన్ మూలంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి మానసిక ఒత్తిడిలకు గురయ్యారు. మరో వారంలో 2020కు స్వస్తి పలుకనున్నాం. నూతన సంవత్సరంలో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే ఈ ఐదు అలవాట్లు ఉండాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.
వ్యాయామం ..
వ్యాయామంతో మనిషి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు. ఈ విషయంలో 2020 సంవత్సరం అంతా సహకరించలేదు. నిద్రలేచిన వెంబడే ఫోన్‌లతో కుస్తీపట్టారు. సామాజిక దూరం, లాక్‌డౌన్ కారణంగా వ్యాయామం అంతా చేయలేదు. జిమ్‌కు వెళ్లడం ఇబ్బందిగా ఉంటే ప్రతిరోజు ఇంటి పరిసరాల్లోనే వ్యాయామం చేసుకోవచ్చు.
సర్ధుకుపోవడం..
దాదాపు ఈ ఏడాది ప్రతి ఒక్కరు అన్ని విషయాల్లో సర్ధుకుపోయారు. కొన్ని ఫీలింగ్స్‌ని అణిచివేసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అవసరానికి తగ్గట్లు భావాల్ని అణచివేసుకుంటూ పోతే భవిష్యత్తులో మానసిక ఆరోగ్యంపట్ల ప్రభావం చూపుతుందట. ఈ క్రమంలో డ్రగ్స్, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు బానిసవుతామని హెచ్చరిస్తున్నారు. కాబట్టి అన్ని విషయాల్లో సర్ధుకోకుండా మన మనస్సులోని భావాలను ఇతరులతో పంచుకోవాలి.
సరైన నిద్ర ..
సా«ధారణంగా మనిషి సగటున 8 గంటలు నిద్ర పోవాలి. ప్రస్తుతం అలా ఎవరూ పాటించడం లేదు. అనారోగ్య పరిస్థితలు ఎదురవుతాయని తెలిసినా.. మార్పురావడం లేదు. ది స్లీప్ హెల్త్ ఫౌండేషన్ చేసిన పరిశోధనలో 60-90 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నట్లు తెలిసింది. కాబట్టి రానున్న రోజులలో నిద్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణుల సలహా.
ఒత్తిడి..
అనారోగ్యాలకు అసలు కారణం ఒత్తిడికి గురవ్వడం. మన మెదడులో మెదిలే కొన్ని అంశాలపై శ్రద్ధ పెట్టకపోతే ఒత్తిడికి లోనవుతాం. దీంతో మెదడు కార్టిసాల్ అనే ఒక స్టెరాయిడ్ హార్మోన్ విడుదల చేస్తుంది. కార్టిసాల్ జీవక్రియ రోగనిరోధక ప్రతిస్పందనతో సహా శరీరమంతా విసృతమైన పక్రియలను నియంత్రిస్తుంది. ఇది ఎక్కువగా విడుదలైతే మెదడు పని తీరును అడ్డుకుంటుంది. తీవ్రమైన ఆలోచనల నుంచి ఉపశమనం పొందాలంటే మనసుకు నచ్చే పనులు చేయడం మంచిదంటున్నారు.
సోషల్ మీడియాను తగ్గించాలి..
ఈ ఏడాది సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోయాం. లాక్‌డౌన్ కారణంగా ఆఫీసులు, పాఠశాలలు, మూతపడటంతో బయటకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ తరగతులు, టెలికాన్ఫరెన్స్‌లు, జూమ్ మీటింగ్‌ల కారణంగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకే పరిమితమయ్యాం. సోషల్ మీడియాలో ఉండటం మంచిదే కానీ.. నిరంతరం అందులో ఉంటేనే పెద్ద ప్రమాదం. ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది. కాస్త ఇబ్బంౖదైన కానీ.. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించేలా అలవాటు చేసుకోండి.