కుప్పకూలిన కివీస్ టాప్‌ఆర్డర్.. 52/6

ముంబయిలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ టాప్‌ ఆర్డర్ కుప్పకూలింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినంటే పెవీలియన్‌కు చేరడంతో కివీస్ కేవలం 38 పరుగులకే ఆరు వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మహమ్మద్ సిరాజ్ 3, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓపెనర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. మహమ్మాద్ సిరాజ్ ఓవర్‌లో విల్ యంగ్ (4), టామ్ లాథమ్ (10) పెవీలియన్‌కు చేరారు. నాలుగో ఓవర్ తొలి బంతికే యంగ్‌ను ఔట్ చేసిన చివరి బంతికి లాథమ్‌ను పెవీలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రాస్ టేలర్ 1, మిచేల్ 8, హెన్రీ నికోల్స్ 7, రాచిన్ రవిచంద్రన్ 4 పరుగులకే అవుటయ్యాడు. టాప్ ఆర్డర్‌లో లాథమ్ మినహా ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ప్రస్తుతం టామ్ బ్లన్డల్ (7), జెమిసన్ (7) క్రీజులో ఉన్నారు.