కివీస్ ముందు చిన్న లక్ష్యం.. ఇండియాకు సెమీస్ బర్త్ కష్టమే…!

-

టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఉత్కంఠభరిత మైన మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదటి నుంచి… తడబడుతూనే వచ్చింది. 20 ఓవర్లలో ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేసింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు.

టాప్ ఆర్డర్ నుంచి మిడిలార్డర్ వరకు అందరు బ్యాట్స్మెన్ విఫలం కావడంతో న్యూజిలాండ్ జట్టు ముందు తక్కువ టార్గెట్ ను ఉంచింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. నజిబుల్ల ఒక్కడే 48 బంతుల్లో 3 సిక్స్ లు నాలుగు ఫోర్లతో 73 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో 20 ఓవర్లలో 124 పరుగులు చేయగలిగింది ఆప్ఘనిస్తాన్ జట్టు.

ఇక న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బోల్ట్ మూడు వికెట్లు… సౌదీ రెండు వికెట్లు తీసి.. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లను నడ్డి విరిచారు. ఇక ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే 20 ఓవర్లలో 125 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి కాసేపట్లోనే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే… సెమీస్ కు చేరుతుంది. అటు టీమిండియా మాత్రం ఇంటి దారి పట్టక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news