గోపీచంద్‌తో శ్రుతిహాసన్..సెట్‌లో సందడే సందడి

-

టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతిహాసన్..ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో క్రేజీ ఫిల్మ్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తెలుగులో సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలయ్య 107వ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

బ్లాక్ షర్ట్, వైట్ లుంగీలో బాలయ్య చెప్పే డైలాగ్స్ విని జనాలు ఫిదా అవుతున్నారు. మాస్ అవతారంలో బాలయ్య నెక్స్ట్ లెవల్ యాక్షన్ ఈ సినిమాలో ఉండబోతున్నదని దర్శకుడు గోపీచంద్ మలినేని..టీజర్ ద్వారా చెప్పకనే చెప్పేశాడు. ఇందులో విలన్ గా కన్నడ స్టార్ దునియా విజయ్ నటిస్తున్నాడు.

NBK 107లో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. కాగా, తాజాగా ఈ సుందరి సెట్ లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా గోపీచంద్ తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి నెట్టింట వైరలవుతున్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా ‘క్రాక్’ ను మించిన విజయం సాధిస్తుందని డైరెక్టర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news