‘‘కరప్షన్ క్రోధ’’గా సునీల్..ఆగస్టు 15న RC15 అప్‌డేట్!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న RC15 ఫిల్మ్ అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ఇది. కాగా, ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ స్టోరి అందించారు.

ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ఫిల్మ్ ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ఏంటనే విషయమై గత కొద్ది రోజుల నుంచి వార్తలొస్తూనే ఉన్నాయి. ‘‘సర్కారోడు’’ అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్లు వార్తలొచ్చాయి. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘‘అధికారి’’ టైటిల్ ఫైనల్ అయిందని టాక్.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆగస్టు 15న సినిమా అప్ డేట్ అఫీషియల్ గా ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్. కమెడియన్ సునీల్ ఇందులో ‘‘కరప్షన్ క్రోధ’’గా కీలక పాత్ర పోషిస్తు్న్నారు.

శ్రీకాంత్, అంజలి‌ కూడా కీ రోల్స్ ప్లే చేస్తుండగా రామ్ చరణ్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో IAS, IPS ఆఫీసర్‌గానూ, పొలిటీషియన్‌గానూ కనిపిస్తారని తెలుస్తోంది. RC15పైన భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news