అకీరా నందన్, ఆద్య, రేణుదేశాయిలతో పవన్ కల్యాణ్..ఎక్కడంటే?

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ సినిమాలు, రాజకీయం జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న జనసేనాని తాజాగా తన తనయుడు అకీరా నందన్ కోసం టైమ్ కేటాయించాడు. ట్విట్టర్ వేదికగా తన తనయుడు, తనయ, మాజీ భార్య రేణుదేశాయ్ తో పవన్ కల్యాణ్ దిగిన ఫొటో ఒకటి ప్రజెంట్ తెగ వైరలవుతోంది.

సదరు ఫొటోలో పవన్ కల్యాణ్, రేణుదేశాయ్, అకీరా నందన్, ఆద్య చక్కగా నవ్వుతూ కనబడుతున్నారు. అకీరా నందన్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ స్కూల్ ఈవెంట్ కు వెళ్లాడు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అది వైరలవుతోంది.

పవన్ కల్యాణ్ ప్రజెంట్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తి కాగానే హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ లో పాల్గొననున్నారు. రేణు దేశాయ్..మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ లో కీలక పాత్ర పోషిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news