తెలంగాణలో కర్ఫ్యూ పొడిగింపు… కొత్త గైడ్ లైన్స్ ఇవే

-

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో కర్ఫ్యూపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 నుంచి తెల్లవారుజాము వరకూ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ కర్ఫ్యూ మే8తో ముగిస్తుండటంతో మరో వారం పొడించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 15వరకూ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. పెళ్లిలకు, శుభాకార్యాలకు 100 మందికి మించరాదని పేర్కొంది. ప్రతి ఒక్కరూ మాస్కు, భౌతిక దూరం పాటించాలని సూచించింది. దహన సంస్కాలకు 20 మందికి మించకూడదని తెలిపింది.

అయితే రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటు దేశవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో కర్ఫ్యూని పొడిగించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. శుక్రవారం ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మరో వారం పాటు కర్ఫ్యూని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కర్ఫ్యూ అమలు కోసం జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలను కట్టబెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news