ఫోర్జరీ ద్వారా నామినేషన్ ఉపసంహరణ.. నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు

Join Our Community
follow manalokam on social media

తిరుపతిలో ఏడో వార్డులో ఫోర్జరీ ద్వారా నామినేషన్ ఉపసంహరణ జరిగిందని తెలిసిందని ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. బలవంతపు ఉపసంహరణలు జరగకుండా జాగ్రత్తలు, అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలాంటి కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. తిరుపతిలో బాధిత అభ్యర్థుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.

ఇక ఈ ఫిర్యాదులను ఎన్నికల సంఘంలో ఉన్న జాయింట్ సెక్రటరీ స్వీకరిస్తారని నిమ్మగడ్డ పేర్కొన్నారు. 7వ డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమెకు తెలియకుండా ఉపసంహరణ జరిగిపోయింది.దీంతో ఆమె భర్త మధుబాబుతో కలిసి రిటర్నింగ్‌ అధికారి వద్దకు వెళ్లి ప్రశ్నించింది. అన్యాయం చేస్తే ఆత్మహత్య చేసుకుంటా ఫలితంగా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుందంటూ రిటర్నింగ్‌ అధికారిని సదరు విజయలక్ష్మి భర్త హెచ్చరించారు. 

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...