అవినీతి పరులను, బద్దకంగా పని చేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకును దిశగా పావులు కదుపుతుంది. అవినీతి పరులు, బద్దకస్తులను బర్తరఫ్ చెయ్యడం మొదటి అంశం కాగా, 30 సంవత్సరాలనుండి ఉద్యోగంలో కొనసాగుతున్నవారిని, 50 యేళ్లు పైబడిన వారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వానుంది. సిసిఎస్ (పెన్షన్) రూల్స్ -1972 లోని ఎఫ్ఆర్ 56 (జె) / రూల్స్ -48 కింద బలవంతంగా పదవీ విరమణ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులోకి ఎ, బి, సి కేటగిరీ అధికారులు వస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న COVID-19 మహమ్మారి కారణంగా మొత్తం ప్రక్రియలో కొంచెం ఆలస్యం జరిగింది. మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడానికి, ఈ సమస్యను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.
అవినీతి, అసమర్థత, సక్రమ హాజరుకావడం లేని వారిని, మరికొంతమంది అధికారులను బలవంతంగా పదవీ విరమణ చేయమని కోరనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా, అవినీతికి పాల్పడినవారిని మూడు నెలల జీతం భత్యంతో పదవి నుంచి తప్పుకోవాలని సూచించనున్నారు.ఇందుకుగాను ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి లీనా నందన్ మరియు జెఎస్ అశుతోష్ జిందాల్ స్థానంలో సీనియర్ ఐఎఎస్ అధికారులు, ప్రీతి సుడాన్, రచ్నా షాలను నియమించారు. ఈ కమిటీ ద్వారా అవినీతి, అసమర్థ అధికారుల జాబితా కూడా ఖరారు చేయబడుతుంది. అధికారుల ఇచ్చే నివేదికల ఆధారంగా వారిని బలవంతంగా పదవీ విరమణ చేయించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.
ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలయ్యింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ అధికార పరిధిలోని అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటున్నాయి.గత సంవత్సరం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆరు వందల మంది అధికారులను బలవంతంగా పదవీ విరమణ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 27 మంది సీనియర్ అధికారులను బలవంతంగా పదవీ విరమణ చేసింది. ఢిల్లీ, హర్యానా, యుపి, మహారాష్ట్ర, అస్సాం, త్రిపుర ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాల్లోని అవినీతి అధికారులపై కేంద్రం తరఫున చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇలాంటి ల అసమర్థ అదికారుల వల్ల అభివృద్ధి కుంటుపడింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కారణంగా దెబ్బతిన్నాయి. సామాన్యులు ప్రజలలో ఆగ్రహానికి దారితీసే విధంగా అధికారుల ప్రవర్తన ఉండటం వల్ల ప్రజలు పథకాల ఫలాలు పొందలేకపోతున్నారనేది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ మరియు ఇతర పర్యవేక్షణ కమిటీలను సుస్ పర్యవేక్షణకు అప్పగించారు.